పెళ్లి చేసిన ఫేస్బుక్ ప్రేమ.. జబర్దస్త్ ఆనంద్ క్యూట్ ఫ్యామిలీ!
on May 18, 2021
'జబర్దస్త్' షో ద్వారా చాలా మంది టాలెంటెడ్ కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందులో ఆనంద్ కూడా ఒకడు. రీసెంట్ గా అతడు తన ఫ్యామిలీను అభిమానులకు పరిచయం చేశాడు. భార్యా, పిల్లలను కెమెరా ముందుకు తీసుకువచ్చి పరిచయం చేయగా.. నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. 'జబర్దస్త్' షోకి వచ్చిన తరువాత కూడా అతడికి అవకాశాలు అంత సులువుగా రాలేదు.
చివరికి చమ్మక్ చంద్ర అతడిని నమ్మి గ్రూప్ లో చేర్చుకోవడంతో టీమ్ లీడర్ అయ్యేవరకు వచ్చాడు. తన సంపాదనతో ఓ ఇల్లు కూడా కట్టుకున్నాడు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ సెట్ చేసుకొని అందులో తన పర్సనల్ విషయాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేయడంతో పాటు విభిన్నమైన కంటెంట్ పోస్ట్ చేస్తుంటాడు. ఇటీవల తన ఫ్యామిలీకి చెందిన వీడియోను పోస్ట్ చేశారు. తన భార్యను మొదటిసారి వీడియో ద్వారా పరిచయం చేశారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు మీ భార్య హీరోయిన్ల కంటే తక్కువేమీ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలానే తన ఇద్దరు కొడుకులకు పరిచయం చేయగా.. వారు కూడా చాలా క్యూట్ గా ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారు. ఆనంద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ఇష్టంగా మారడం తరువాత ఒకరినొకరు పెళ్లి వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో పెద్ద గొడవలు జరిగాయని.. అప్పుడు చమ్మక్ చంద్ర, రోజా గారు సాయం చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆనంద్.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
